మధుమేహం రావడానికి గల కారణాలు – ఆహార నియమాలు

OMKARAMLatest News

మధుమేహం రావడానికి గల కారణాలు – ఆహార నియమాలు

0 Comments

మధుమేహం రావడానికి గల కారణాలు – పాటించవలసిన ఆహార నియమాలు – ఔషదాలు.

  మధుమేహము కలిగినటువంటి మనుష్యుని యొక్క మూత్రం తేనె వలే తియ్యటి మరియు చిక్కటి మూత్రం వెలువరించును. ఈ మధుమేహము రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది శరీరం నందలి రస,రక్త ధాతువులు కొన్ని కారణాలచే క్షీణించడం వలన వాతం ప్రకోపించడం వలన కలుగునది. రెండోవది శరీరం నందు వాతం సంచరించు మార్గములలో కొన్ని దోషములు అడ్డగించునపుడు వాతం ప్రకోపం చెంది కలుగునది . మొదటి రకమైన ధాతు క్షయముచే వచ్చు మధుమేహము తగ్గుట అసాధ్యము. జీవితాంతం ఔషధాలు వాడుతూ ఉండవలెను.

మధుమేహ రోగులు తీసుకోవలసిన ఆహార పదార్థాలు -#omkaramAyur 9059406999

పాతబియ్యం , పాత గోధుమలు, రాగిమాల్ట్, మేకమాంసం , మజ్జిగ, కందిపప్పు కట్టు, పెసర కట్టు, పాత చింతపండు, ఉసిరికాయ, వెలగపండు, తోటకూర, పాలకూర, మెంతికూర , కొయ్యతోటకూర, పొన్నగంటికూర, లేత మునగ కూర, లేత బీరకాయ, లేత సొరకాయ, లేత పొట్లకాయ, లేత బెండ , లేత క్యాబేజి, లేత టమాటో లేతవి మాత్రమే తీసుకోవాలి . బూడిద గుమ్మడి , కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలి .జొన్నరొట్టె చాలా మంచిది.

తీసుకోకూడని ఆహారపదార్థాలు –

  తేలికగా అరగని ఆహారం నిషిద్దం, చేపలు , రొయ్యలు తినరాదు. మద్యపానం , ధూమపానం నిషిద్దం , పెరుగు వాడరాదు , ఇంగువ, వెల్లుల్లి వాడకూడదు, నువ్వులు , నువ్వుల నూనె , ఆవాలు, ఆవనూనె వాడరాదు. ఎర్రగుమ్మడి తీసుకోరాదు, శనగపిండి తినరాదు, నూనెతో వేపిన పదార్థాలు వాడరాదు, కొబ్బరి ముట్టుకోకూడదు, పనస, ద్రాక్ష, కమలా పండ్లు నిషిద్దం, దుంపకూరలు పూర్తిగా మానివేయాలి, భోజనం చేసిన వెంటనే నిద్రించరాదు, బెల్లము , కొత్త చింతపండు వాడరాదు .

మధుమేహంలో ఉపయోగపడు ఔషధాలు –

 • పొడపత్రి ఆకు రసాన్ని రోజుకి పావుకప్పు తాగుతుంటే ఈ వ్యాధి తగ్గును.
 • ఇండుప గింజ సగం వరకు అరగదీసి ఆ గంధాన్ని ప్రతినిత్యం నీటిలో కలిపి తీసుకొనుచున్న మధుమేహం తగ్గును.
 • నేరేడు గింజల చూర్ణం పావు చెంచా ఉదయం సాయంత్రం ఒక గ్లాస్ నీటితో కలిపి సేవించుచున్న మధుమేహం నియంత్రణ అగును.
 • మధుమేహం అతిగా ఉన్నవారు పూటకి ఒక లవంగ మొగ్గ చప్పరిస్తూ ఉన్న మధుమేహం నియంత్రణ అగును.
 • ప్రతినిత్యం ఒక కప్పు ఉలవలు ఉడకపెట్టిన నీటిని తీసుకొనవలెను .
 • త్రిఫల చూర్ణమునకు మధుమేహం తగ్గించే గుణము కలదు. కాకపోతే బయట దొరికే త్రిఫల చూర్ణం లో కరక్కాయ, తానికాయ, ఉశిరికాయ సమపాళ్లలో ఉంటాయి . అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే మోతాదులో తయారుచేసుకొని రోజు రాత్రిపూట అరచెంచా చూర్ణం అరకప్పు నీటిలో వేసుకొని రాత్రిపూట పడుకునేప్పుడు తాగవలెను . కరక్కాయ పెచ్చులు చూర్ణం ఒక భాగము , తానికాయ చూర్ణం రెండు భాగాలు , ఉశిరికాయ చూర్ణం మూడు భాగాలు కలిపి ఒకే చూర్ణంగా రూపొందించుకొని రాత్రిపూట వాడుచున్న మధుమేహం త్వరగా నియంత్రణకు వస్తుంది.
 • తంగేడు పువ్వుల కషాయం ఉదయం , సాయంత్రం సేవించుచున్న మధుమేహము తగ్గును.
 • రోజూ అరటిపువ్వుని ఉడకబెట్టి అల్పహారంగా తీసుకొనుచున్న మధుమేహం తగ్గును.
 • మర్రిచెట్టు బెరడు చూర్ణం అరచెంచా కాని లేక బెరడు కషాయం పావుకప్పు కాని ప్రతినిత్యం సేవించుచున్న మధుమేహం నిశ్చయంగా తగ్గును.
 • ఉసిరికాయల కషాయం కాని లేక ఉసిరిగింజల కషాయం రోజుకి అరకప్పు తాగుచున్న మధుమేహం తగ్గును.
 • లేత మామిడి ఆకులు ఎండించి చూర్ణం చేసి రోజుకి అరచెంచా తీసుకున్నచో మధుమేహం తగ్గును. నా అనుభవ యోగాలు –
 • మధుమేహం 300 వరకు ఉంటే మూడు మారేడు దళాలు అనగా 9 లేత ఆకులు ఉదయాన్నే పరగడుపున , సాయంత్రం ఆహారానికి గంట ముందు తినుచున్న కేవలం 15 నుంచి 20 రోజుల్లో 170 నుంచి 190 వరకు వచ్చును. ఆ తరువాత రెండు మారేడు దళాలు చొప్పున ఉదయం , రాత్రిపూట పైన చెప్పిన సమయాల్లో తీసికొనవలెను. త్వరలోనే సాధారణ స్థితికి వస్తారు.
 • పొడపత్రి చూర్ణం ఒక స్పూన్ , నేరేడు గింజల చూర్ణం ఒక స్పూన్ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో నానబెట్టి రాత్రి సమయంలో ఆహారానికి గంట ముందు సేవించవలెను . అదేవిధముగా రాత్రిపూట పైనచెప్పిన మోతాదులో గ్లాసు గోరువెచ్చటి నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున సేవించవలెను . పైన చెప్పినవన్నీ నేను కొంతమంది వ్యాధిగ్రస్తుల చేత వాడించాను . చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ఒకేసారి అల్లోపతి ఔషధాలు ఆపి ఇవి వాడవద్దు. ఇవి వాడుతూ అల్లోపతి ఔషదాల మోతాదు తగ్గించుకుంటూ చివరకి పూర్తిగా ఆపివేయవచ్చు . ఈ ఔషధాలు వాడు సమయంలో టీ , కాఫీ , మద్యం , మాంసాహారం ముట్టుకోరాదు. త్వరగా గుణం కనిపించును.
#omkaramAyurXemam Diabetic Cure
#omkaramAyurXemam Diabetic Cure


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *