అతి బల చెట్టు ఔషధ గుణాలు తెలుసుకోండి!!

OMKARAMLatest News

అతి బల చెట్టు ఔషధ గుణాలు తెలుసుకోండి!!

0 Comments

అతిబ‌ల మొక్కను దువ్వెన బెండ‌, ముద్ర బెండ‌, తుత్తురు బెండ అని  అంటారు. ఈ మొక్క చాలా మందికి తెలిసిన‌ప్ప‌టికి దీనిలో ఉండే ఔష‌ధ గుణాలు  తెలియ‌దు.#OmkaramAyurTips9059406999

శ‌రీరానికి అమిత‌మైన బ‌లాన్ని ఇవ్వ‌డంలో ఈ మొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌నుక దీనిని అతిబ‌ల అని పిలుస్తూ ఉంటారు. ఆయుర్వేదంలో. మూత్ర నాళ స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలో, మూత్ర పిండాల‌లో రాళ్ళను క‌రిగించ‌డంలో కూడా ఈ మొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది. పిచ్చి కుక్క క‌రిచిన వారికి ఈ మొక్క ఆకుల ర‌సాన్ని రెండు టీ స్పూన్స్ చొప్పున తాగించి, కుక్క క‌రిచిన చోట ఈ ఆకుల ర‌సాన్ని పిండి, అవే ఆకుల‌ను ఉంచి క‌ట్టు క‌ట్టడం వ‌ల్ల విష ప్ర‌భావం త‌గ్గుతుంది.

కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతాన్ని త‌గ్గించ‌డానికి  ఈ చెట్టు ఆకుల‌ను ముద్దగా చేసి ఆవ‌నూనె క‌లిపి రాయ‌డం వల్ల కీళ్ల నొప్పి, కీళ్ళ వాతం త‌గ్గుతాయి. ఈ చెట్టు ఆకుల‌ను ఉడికించి తింటే ర‌క్త మొల‌లు త‌గ్గుతాయి. శ‌రీరంలో వాపులు ఉన్నచోట ఆకుల‌ను ఉడికించి క‌ట్టుగా క‌ట్ట‌డం వ‌ల్ల వాపులు త‌గ్గుతాయి.  
ఆకుల‌కు ప‌సుపును క‌లిపి మెత్త‌గా నూరి గాయాల‌పై, పుండ్ల‌పై రాయ‌డం వల్ల గాయాలు త్వ‌ర‌గా మానుతాయి.

మూత్రంలో మంట‌, మూత్ర పిండాల‌లో రాళ్ళు ఉన్న వారు ఈ మొక్కకు చెందిన‌ నాలుగు ఆకుల‌ను తీసుకుని శుభ్రంగా క‌డిగి పావు లీట‌ర్ నీళ్ళలో వేసి స‌గం అయ్యే వ‌ర‌కు మ‌రిగించి చ‌ల్లారిన త‌రువాత వ‌డ‌క‌ట్టి ఈ నీటికి కొద్దిగా తేనెను క‌లిపి ఈ మొత్తాన్ని మూడు పూట‌లా తీసుకోవ‌డం వ‌ల్ల మూత్రంలో మంట‌, మూత్ర పిండాల‌లో రాళ్ళ స‌మ‌స్యల‌ నుండి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

#OmkaramAyurvTipsAthibala9059406999
#OmkaramAyurvTipsAthibala9059406999


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *