త్రిఫల చూర్ణం.!!

OMKARAMLatest News

త్రిఫల చూర్ణం.!!

0 Comments

త్రిఫల చూర్ణం అనగా ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమము. దీన్ని ఆయుర్వేద వైద్యంలో వివిధ రోగాల నివారణకు ఉపయోగిస్తారు. మన శరీరాన్ని శుభ్రం చేయడంతో మనకు ఎంతగానో ఉపకరించే ఆయుర్వేద ఔషధం త్రిఫల చూర్ణం. త్రిఫలా చూర్ణాన్ని త్రిదోష రసాయనంగా చెబుతారు. మన శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను ఈ చూర్ణం సరిచేస్తుంది
ఉసిరి గుణాలు:
ఉసిరి: ఉసిరిలో సి విటమిను అత్యధికంగా ఉంటుంది. ఉసిరిలో టానిక్‌ ఆమ్లం, గ్లోకోజ్‌, ప్రొటీన్‌, కాల్షియం లు ఉన్నాయి. ఉసిరి పిత్తదోషాన్ని సరిచేస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. సాఫీ విరోచనానికి దోహదపడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. కడుపులో వాపు, పేగుగోడల వాపు, కడుపులో మంటలు, పుండ్లకు ఉసిరి విరుగుడు. మలబద్ధమును తగ్గిస్తుంది. విరోచనాలు, కాలేయ లోపం, కడుపులో మంటలను నిరోధిస్తుంది.
బత్తాయితో పోలిస్తే 20 రెట్లు అధికంగా సి విటమిను ఉసిరిలో ఉంది.
తానికాయ గుణాలు:
తానికాయ: తానికాయ వగరు, ఘాటు రుచి కలిగి ఉంటుంది. దీనిలో విటమిను ఎ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎలర్జీలను నివారిస్తుంది. ప్రేగుల్లో చేరిన పరాన్న జీవులను సంహరిస్తుంది. గొంతులో ఏర్పడిన ఇబ్బందులను తొలగిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. కఫదోషాలను నివారిస్తుంది. శరీరంలో అదనంగా చేరిన శ్లేష్మాన్ని తొలగిస్తుంది. ఉబ్బస వ్యాధులను నివారిస్తుంది. శ్వాసకోశ సమస్యలు, ఎడతెగని దగ్గులను నివారిస్తుంది.
కరక్కాయ గుణాలు:
కరక్కాయ: త్రిఫలచూర్ణంలోని ముఖ్యమైన ఫలాల్లో కరక్కాయ ఒకటి. విరోచనాలను కట్టిస్తుంది. ఛాతీలో మంటను తగ్గిస్తుంది. కాలేయం సరిగా పనిచేసేటట్లు చేస్తుంది. వాత దోషాలను అరికడుతుంది. కండరాలు తీవ్రంగా కొట్టుకోవటాన్ని తగ్గిస్తుంది. నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. మలబద్ధాన్ని తొలగించి, నాడీ స్థిరత్వాన్ని ఇస్తుంది. శారీరక బలహీనతను, అనవసరపు ఆదుర్దాలను తొలగిస్తుంది. జీర్ణాశయపు గోడలను బలోపేతం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారంలోని పోషకాలను గ్రహించేశక్తిని మెరుగుపరుస్తుంది.
వాడే విధానం, ఉపయోగాలు
త్రిఫలను నీటిలో కలిపిన కషాయంగా, రాత్రి పూట పాలు లేదా తేనెతో తీసుకోవాలి. వైద్యుని సలహాననుసరించి రోజూ రెండు నుండి అయిదు గ్రాముల త్రిఫల చూర్ణం ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. ఈ మూడు ఫలాల పొడులను సమపాళ్ళలో కలపడం వలన ఇది శక్తివంతమౌతుంది. సమపాళ్ళలో కాక మూడుపాళ్ళు ఉసిరి, రెండు పాళ్ళు తానికాయ, ఒకపాలు కరక్కాయ కలిపిన త్రిఫల చూర్ణం, త్రిఫల మాత్రల రూపంలో కూడా తీసుకోవచ్చు.
· త్రిఫల తయారీకోసం వాడే మూడు ఫలాలను విడివిడిగా, నిర్ణీత మోతాదులో వాడాలి. ఈ మూడు ఫలాలకు జీర్ణవ్యవస్థను మెరుగురిచే శక్తి వుంది.
· కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయానికి చెరుపు చేసే విషపూరిత పదార్థాలను త్రిఫల తొలగిస్తుంది.
· అజీర్ణం, విరేచనాలు వంటి ఇబ్బందులు ఉన్నప్పుడు రెండు స్పూన్ల నీటిలో ఒక స్పూన్‌ త్రిఫల చూర్ణం వేసి మరిగించి వడగట్టి ఆ కషాయానికి కొద్దిగా నీరు కలిపి తీసుకోవాలి.
· మలబద్ధము బాధిస్తున్నప్పుడు అయిదు గ్రాముల త్రిఫలచూర్ణాన్ని కొద్దిగా తేనెతో కలిపి ఒక ముద్దగా చేసి అరకప్పు పాలతో పాటుగా పడుకునేముందు తాగితే ఇబ్బంది తొలగిపోతుంది.
· ఒక చెంచా త్రిఫలచూర్ణం రెండు చెంచాల కొబ్బరి నూనెలో మరిగించి వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే శిరోజాలకు మంచిటానిక్‌లా పనిచేస్తుంది. తలస్నానం తరువాత త్రిఫల చూర్ణం కషాయంతో చివరిగా తలమీద పోసుకుంటే శిరోజాలు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి.
· చర్మరక్షణలో త్రిఫల రక్తాన్ని శుద్ధిచేస్తుంది. రక్తశుద్ధితో చర్మవ్యాధులు తొలగిపోతాయి. ఎటువంటి చర్మతత్వం కలిగినవారికైనా త్రిఫల మేలు చేస్తుంది. చర్మం కోమలంగా ఉండేలా చేస్తుంది. చర్మానికి మెరుగునిస్తుంది. శరీరంలో పేరుకున్న విషపదార్థాలను తొలగిస్తుంది. చర్మంలోని రక్తనాళాల్లో రక్తప్రసరణను పెంచి చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. చర్మానికి పోషణనిస్తుంది. చర్మానికి సహజంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కొందరి చర్మం సున్నితంగా ఉండి ఎలర్జీలకు గురి అవుతుంది. ఈ లోపాన్ని త్రిఫల సరిచేస్తుంది. సూర్యరశ్మి వలన కలిగే దుష్ప్రభావాలను కూడా త్రిఫల నిరోధిస్తుంది.
· త్రిఫల చూర్ణాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రుతుచక్ర సమస్యలను కూడా అరికట్టవచ్చు. రుతుచక్రం సరిగ్గా లేనివారు వైద్యుని సలహామేరకు త్రిఫల చూర్ణాన్ని వాడవచ్చు.
మరిన్ని ఉపయోగాలు
· కళ్లకు, చర్మానికి, గుండెకు ఎంతో మేలు చేస్తుంది.
· జుట్టును త్వరగా తెల్లగా అవనీయదు. అలాగే జుట్టు బాగా పెరిగేందుకు సహకరిస్తుంది.
· ముసలితనం త్వరగా రానీయదు.
· జ్ఞాపకశక్తిని బాగా వృద్ధి చేస్తుంది.
· ఎర్ర రక్త కణాలను బాగా వృద్ధి చేస్తుంది.
· రోగనిరోధక వ్యవస్థ ను బాగా శక్తివంతం చేస్తుంది.
· ఆహారం బాగా సక్రమంగా జీర్ణం అయేలా చేస్తుంది.
· ఆమ్లత(అసిడిటీ) ను తగ్గిస్తుంది.
· ఆకలిని బాగా పెంచుతుంది.
· యురినరి ట్రాక్ట్ సమస్యల నుంచి బాగా కాపాడుతుంది.
· సంతాన సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది.
· శ్వాస కోశ సంబంధమైన సమస్యలు రావు. ఒక వేళ ఉన్నాకూడా అదుపు లో ఉంటాయి.
· కాలేయమును చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.
· శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది.
· పెద్ద ప్రేవు లను శుభ్రం గా ఉంచి, పెద్ద ప్రేవు లకుఏమీ వ్యాధులు రాకుండా రక్షిస్తుంది.
· రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
· జీర్ణశక్తి ని పెంచుతుంది.
· అధిక బరువును అరికడుతుంది.
· శరీరం లోని లోని చెడు పదార్ధాలను బయటకు పంపిస్తుంది.
· శరీరం లో బాక్టీరియా ను వృద్ధి కాకుండా ఆపుతుంది.
· కాన్సరు ను కూడా నిరోధిస్తుంది.
· కాన్సరు కణములు పెరగకుండా కాపాడుతుంది.
· రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
· ఎలర్జీ ని అదుపులో ఉంచుతుంది.
· సీరుం కొలెస్ట్రాల్ ను బాగా తగ్గిస్తుంది.
· చక్కగా విరోచనం అయేలా చేస్తుంది.
· హెచ్ ఐ వీ ని కూడా నిరోధించ గల శక్తి త్రిఫల చూర్ణమునకు ఉంది.
· నేత్రవ్యాధు లను నిరోధించే శక్తి త్రిఫలకు ఉంది.

TrifalaOmkaramAyurveda


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *