జుట్టు_సమస్యకు పరిష్కారంమార్గం అవగాహనాకోసం

OMKARAMLatest News

జుట్టు_సమస్యకు పరిష్కారంమార్గం అవగాహనాకోసం

0 Comments

1.- జుట్టు బాగా పెరగాలన్నా, మృదువైన కురులు కావాలన్నా, మెంతి కూర, పుదీనా రెండూ సమానభాగాలుగా తీసుకొని మెత్తగా రుబ్బి తలకు పెట్టుకోవాలి. ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇది 15 రోజులకొకసారి చేస్తుంటే పెనుకోరుకుడు పోతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

2.- సీతాఫలం గింజలను మెత్తగా పొడిచేసి తలకు పట్టించి అరగంట తరువాత స్నానం చేస్తే తలలో చుండ్రు తగ్గి, పేలుకూడా పోతాయి.

3.-పుదీనా ఆకుల్ని నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి, తలకు నూనే రాసుకునేప్పుడు రెండు చిటికెడు ఈ చూర్ణాన్ని నూనెలో కలిపి తలకు బాగా మర్దనా చేయాలి.
ఇలా చేస్తే వెంట్రుకలు రాలిపోవడం తగ్గుడమే కాకుండా వెంట్రుకలు రాలిపొఇన చోట తిరిగి వెంట్రుకలు మ

4.- ఉసిరి పొడి రెండు స్పూన్లు, గుడ్డులోని తెల్ల సోన, రెండు స్పూన్లు నిమ్మరసం ఈ మూడింటిని కలిపి తలకు బాగా పట్టించాలి. అరగంట తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జుట్టు రాలిపోవడం అనే సమస్య ఉండదు.

5.-జుట్టు నల్లగా నిగనిగలాడానికి నవీన్ రోయ్ సలహాలు :

కావలసిన పదార్దాలు:

  1. వెల్లుల్లి పొట్టు
  2. కొబ్బరి నునే.

జుట్టు నల్లగా నిగానిగాలాడానికి చిట్కా

తయారుచేయు_విధానం:

వెల్లుల్లి పొట్టుని ఒక కడాయిలో వేసి వేడి చేస్తే , అది నల్లగా మసిల మారుతుంది .
దానిని మంచి కొబ్బరి నునే తో కలిపి , ఒక సీస లో బద్రపరుచు కోవాలి.

రోజు క్రమం తప్పకుండ తలకు మర్దన చేయాలి. ఇలా చేస్తే తెల్ల జుట్టు రాకుండా నివారించవచ్చు.

6.- #చుండ్రు_నివారణ:

కావలసిన పదర్దాలు :
1). కల బంధ రెమ్మలు -3
2). కొబ్బరి నూనె. – 1/4 కే. జి.

చుండ్రు నివారణ
తయారు చేయు విధానం:
కల బంధ రెమ్మల నుండి గుజ్జును తీసి, కొంచం మిక్స్ చేయాలి. తరువాత ఒక గిన్నెలో కొబ్బరి నూనె మరియు కల బంధ గుజ్జు సమానంగా తీసుకొని పోయి మీద చిన్న మంటలో ఉంచి కొబ్బరి నూనె బంగారు రంగు లో వచెంత వరకు మెల్లిగా కలుపుతూ ఉండాలి. కొబ్బరి నూనె బంగారు రంగు లో వచ్చిన తరువాత పోయి ఆపేసి, కొబ్బరి నూనె చల్ల బడినాక, ఒక సీస లో బద్ర పరుచు కోవాలి.

ఉపయోగాలు:

  1. చుండ్రు నివారణ.
  2. జుట్టు రాలడం దగ్గుతుంది.
  3. తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది.

చుండ్రు నివారణకు మరి కొన్ని చిట్కాలు:

  1. మెంతులను రాత్రంత నానబెట్టి , వాటిని రుబ్బి పెరుగు తో కలిపి తలకు పట్టించి శీకాయి తోటి స్నానం చేయాలి. ఇలా వారానికి 3 సార్లు చేయాలి.
  2. సొంటి కొమ్మును ఎండలో ఎండపెట్టి , దాన్ని మిక్సిలో పట్టి , వస్త్రదాలితం చేసి , ఆ పొడిని చుండ్రు ఉన్న చోట నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేయాలి


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *