చర్మవ్యాధులు రావడానికి గల కారణాలు –

OMKARAMLatest News

చర్మవ్యాధులు రావడానికి గల కారణాలు –

0 Comments

 • విరుద్ధములగు అన్నపానములు తినటం అనగా పాలతో తయారైన సేమ్యా , కోవా , ఐస్ క్రీం తిని పెరుగన్నం తినటం లేదా చల్లని కూల్ డ్రింక్ ని వేడిఅన్నం , కూరలు కలిపి తినటం ఇలాంటి ఆహారపు అలవాట్లు పాటించటం .
 • మలమూత్రాలను ఆపడం , అదేవిధముగా వాంతి వంటి సహజ వేగాలను బలవంతముగా నిరోధించడం .
 • భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయుట , ఎండలో తిరుగుట చేయరాదు .
 • ఎండలో తిరిగి వచ్చి చల్లని నీరు తాగరాదు .
 • అతిగా శ్రమపడి వచ్చి వెంటనే నీటిని సేవించరాదు .
 • అజీర్ణముగా ఉండగా మరలా భుజించరాదు . అనగా ముందు తిన్నది సంపూర్ణముగా అరగక ముందు మరలా భోజనం చేయరాదు .
 • కొత్తబియ్యపు అన్నం , పెరుగు మరియు చేపలు కలిపి తినరాదు .
 • అధికంగా పులుపు , ఉప్పు తినరాదు .
 • మినుములు , ముల్లంగితో చేయబడిన వంటలు , పాలు నువ్వులతో చేసిన వంటలు ఎక్కువుగా తీసుకొనుట
 • తినిన ఆహారం జీర్ణం కాకముందే దాంపత్యములో పాల్గొనుట చేయరాదు .
 • పగలు నిద్రించరాదు . పగలు నిద్రించుట వలన శరీరం నందు శ్లేష్మము పెరిగి దానివలన రక్తప్రసరణకు అవరోధము కలిగి చర్మమునకు రక్తప్రసరణ సరిగ్గా జరగక చర్మవ్యాధులు సంభవించును . ఎండాకాలం కొంచంసేపు పగలు నిద్రించవచ్చు . పైన చెప్పినవిధముగా విరుద్ధమైన ఆహారం , పనులు చేయుటవలన శరీరంలో చర్మము , రక్తము , మాంసము , లింప్ గ్రంథులు దోషమును పొంది రకరకాల చర్మవ్యాధులు కలుగును. చర్మవ్యాధులు రావడానికి పూర్వము కనిపించు లక్షణములు –
 • స్పర్శజ్ఞానం క్రమేపి తగ్గిపోవుట .
 • చెమట ఎక్కువుగా పట్టుట లేదా చర్మవ్యాధి ప్రదేశము నందు అసలు చెమట పట్టకపోవును .
 • శరీరవర్ణము మారి నల్లబారిపోవుట .
 • దద్దుర్లు .
 • పోట్లు .
 • అలసట , వడలినట్లు అగుట.
 • వ్రణములు లేచి అధికభాధతో కూడి శీఘ్రముగా
  జనించి త్వరగా మానకుండా ఉండటం.
 • తాపము ( చర్మం అంతా మంటలు ) . అసాధ్య చర్మవ్యాధి లక్షణములు –
 • రోగి బలహీనుడుగా ఉండి దప్పిక , మంట , అగ్నిమాంద్యములతో కూడి క్రిములు ఏర్పడిన అసాధ్యము .
 • చర్మవ్యాధి ఏర్పడి 10 సంవత్సరాలు దాటిన
  అసాధ్యము . చర్మవ్యాధుల యందు చికిత్సాక్రమము – శరీరము నందలి వ్యర్ధపదార్ధముల వలన చర్మవ్యాధులు వచ్చును . కాబట్టి వానిని వివిధరకాల పద్ధతుల ద్వారా వాంతి , విరేచనం మొదలగు శోధన పద్ధతులను ఉపయోగించి వ్యర్ధాలను బయటకి పంపుతూ ఔషధాలను ఇయ్యవలెను . చర్మవ్యాధుల యందు పథ్యము –
 • తేలికగా అరిగెడి ఆహారం తీసికొనవలెను .
 • త్రిఫలములు – ఉశిరి , కరక్కాయ , తానికాయ
  విరివిగా వాడవలెను .
 • త్రిఫలా ఘృతము కూడా వాడవచ్చు .
 • పాతధాన్యములు వాడవలెను .
 • యవలు , చామలు , కొర్రలు , కందికట్టు , పెసర
  కట్టు , మేకమాంసం వాడవలెను .
 • బీరకాయ , పొట్లకాయ , దోసకాయ , పెరుగు
  తోటకూర , పొన్నగంటికూర , మెంతికూర , ఆవు
  నెయ్యి , తెల్ల గలిజేరుకూర , తేనె , నీరుల్లి . పైన చెప్పిన పదార్ధాలు ఆహారంలో తప్పక భాగం చేసుకొనవలెను . చర్మవ్యాధుల యందు అపథ్యము –
 • చింతపండు పులుపు , అతిగా కారం , ఆవాలు ,
  గుమ్మడి , వెల్లుల్లి , పెరుగు , పాలు .
 • బెల్లం , కల్లు , సారాయి , నువ్వులు .
 • మినుములు , చెరుకురసము , పానకము .
 • చేపలు , నీటిపక్షులు , కోడి మాంసం , పావురం .
 • అతిగా వ్యాయామం , స్త్రీసంభోగం చేయరాదు . పైన చెప్పినవిధముగా ఆహారపు అలవాట్లు పాటిస్తూ సరైన వైద్యుడి పర్యవేక్షణలో ఔషధాలు సేవించుచున్న చర్మవ్యాధుల నుంచి త్వరగా బయటపడగలరు. ఇక్కడ మనం ముఖ్యముగా గుర్తు ఉంచుకోవాల్సిన విషయము ఏమిటంటే వ్యాధి సంప్రాప్తినిచ్చిన తరువాత ఔషధాలు సేవించుట కంటే వ్యాధి రాకుండా చూసుకోవడమే అత్యంత ప్రధానమైనది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *