గురువు శిష్యుడికి ఏమి_చేస్తాడు… ఎలా శక్తిని ఇస్తాడో తెలుసుకుందాం…
గురువు ఏదో చేస్తాడని ఆశిస్తాం మనం! మన బాధలు, బరువులు ఆయన వెంటనే తొలగిస్తాడని ఆశిస్తాం. ఆ పని ఏ గురువు చేయడు. చేయాల్సిన అవసరం కూడా లేదు.
ఓంకారము మంత్ర సాధన #Omkaram Guruji 9059406999 (గురువు సూచనలతో మంత్ర సాధాన చేస్తే లక్ష్యాన్ని చేరుతము)
మన బాధలు బరువులు మనమే మోసే శక్తిని ఇస్తాడు. కొత్త కొత్త సమస్యలు రాకుండా, మనకు తలంటి పోస్తాడు. ఉన్న బాధలు క్రమంగా పోతాయి. కొత్త బాధలు ఏమీ రావు. అంటే మన భవిష్యత్తు గట్టి హమీ గురువు ఇస్తాడు. శిష్యుల ఆలోచనల్లోని కల్మషాలను తొలగించడం గురువు చేసే పని! దాని ద్వారా మనలోని అజ్ఞాన అంధకారం తొలగిపోతుంది.అని మన ఓంకారమ గురువు గారు అంటున్నారు
మిగిలింది జ్ఞానం – అని మాత్రం తెలియదు. అది జ్ఞానం అని తెలిసిన రోజు మనం గురువులం అయిపోతాం. దాని పేరు జ్ఞానోదయం! దాని పేరు ఆత్మ దర్శనం.
శిష్యుడిని స్వతంత్రంగా ఎదగనిచ్చే వాడు నిజమైన గురువు. ఎవరూ తన మీద ఆధారపడకుండా ఆత్మ జ్ఞానం కలిగిస్తాడు. స్వేచ్ఛ లోనే అభివృద్ధి సాధ్యం అని గురువు యొక్క సిద్దాంతం. ప్రతీ చిన్న విషయానికి గురువు పైన ఆధారపడి బ్రతికే శిష్యుడిని దగ్గరికి కూడా రానివ్వడు. అలాంటి ఆలోచన కూడా అభిలషించడు. శిష్యుడు దూరంగా ఉంటూ తనంతట తాను ఎదగాలని #Omkaram Guruji గురువు ఆశిస్తాడు.
కానీ మనం ఏం ఆశిస్తున్నాం!? ఎందుకు!? దాన్ని బట్టి గురువు అవసరం ఉంటుంది. మన యొక్క సంధేహాలను తీర్చడం గురువు యొక్క పని కాదు. మన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడు. ఆ పని పుస్తకాలు… యూట్యూబ్ వీడియోలు చేసే వారు చేస్తారు. మన యొక్క ఆత్మ అన్వేషణ లో సహయ సహకారాన్ని అందించే వారు నిజమైన గురువు! గురువు చేసే పని బయటకు కనిపించదు శిష్యుడు దాన్ని గుర్తించలేడు. శిష్యుడికి తెలియకుండానే తనలో పరివర్తన తీసుకురావడం #Omkaram Guruji గురువు యొక్క ముఖ్య ఉద్దేశ్యం!
గురువు ఎంత శ్రమించినా శిష్యుడు అభివృద్ధి చెందలేదు అంటే అది శిష్యుడి అయోగ్యత కానీ గురువు అసమర్థత కాదు. ఇద్దరికీ పొంతన లేదు అని అర్థం. సరిగా ట్యూన్ కాకపోతే అన్నీ అపస్వరాలే జరుగుతాయి.
వాస్తవానికి గురువు ఏమీ చేయడు. మనలోకి మనలోని మూలాల్లోకి చూస్తాడు. మనలో అనేక జన్మలు గా పేరుకుపోయిన చెత్తా చెదారం ఏరి పారేసే పనిలో ఉంటాడు. అందుకు శిష్యుడి యొక్క సహకారం అవసరం. లేకపోతే ట్రీట్మెంట్ కి సహకరించని పేషెంట్ లా అయిపోతుంది. ఆ పని శిష్యుడు చేయనిస్తాడా!? సొమ్మేదో పోయినట్లు విలవిల్లాడిపోతాం. ప్రకృతి శిష్యుడి నైజం. ప్రజ్ఞ గురువు స్వభావం. అందుకే శిష్యుడికి -#Omkaram Guruji-గురూజీ మహారాజ్ గురువు చెప్పేవి..చేసేవి అంత తొందరగా అర్థం కాదు.