కలియుగంలో భూమిపై ధర్మాన్ని, నీతిని స్థాపించేందుకు దైవసంకల్పంతో జన్మించిన కారణ జన్ముడు “శ్రీ రాఘవేంద్ర స్వామి”.
శ్రీ రాఘవేంద్ర స్వామి కొలువై ఉన్న ప్రాంతమే “మంత్రాలయం”. మంత్రాలయం అసలు పేరు “మాంచాలే”.మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో తుంగభద్రా నదీమ్మతల్లి ఒడ్డున నెలకొని ఉంది.
రాఘవేంద్ర స్వామి ప్రజల గుండె గుడిలో కొలువై బృందావనంలో నిత్యపూజలు అందుకుంటున్నాడు. అందుచేత రాఘవేంద్ర స్వామిని గురువారాల్లో స్మరించుకుని పూజలు చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు. గురు రాఘవేంద్రుడు తన జీవితమంతా అవిశ్రాంతంగా శ్రీహరి మహత్మ్యాన్ని ప్రవచించి, విస్తృతి చేశారు. శ్రీహరి కృపవల్ల ఆయన ఎన్నో మహిమలను ప్రదర్శించారు.
You Can Contact With Omkaram Services 9059406999