ఈ చూర్ణములో బెల్లము కలపవలసి వచ్చిన చూర్ణపు మోతాదుకు సమానంగా , చక్కెర కలపవలసి వచ్చిన చూర్ణముకు రెట్టింపు మోతాదులో కలపవలయును . ఇందు ఇంగువను కలపవలసి వచ్చిన ఇంగువను నేతితో పొంగించి కలుపవలెను . నెయ్యి కలపవలసి వచ్చిన ఇంగువకు రెట్టింపు మోతాదులో , నీటిని కలపవలసి వచ్చిన చూర్ణముకు నాలుగురెట్లు చేర్చవలెను . చూర్ణము అయినను , మాత్రలు అయినను , లేహ్యమైనను , కల్కమ్ అయినను సేవించిన పిదప పాలు మొదలగువాటిని తాగవలసిన యెడల వాతరోగము నందు 12 తులములు , పైత్యరోగము నందు 8 తులములు , శ్లేష్మరోగము నందు 4 తులములు పుచ్చుకొనవలెను . </code></pre>చూర్ణమును భావన ( నానబెట్టి ఆరబెట్టుట ) చేయవలసిన చూర్ణమును , చూర్ణం మునుగునంతవరకు రసము పోసి ఆ రసం ఇగురునంత వరకు భద్రపరచి ఉంచవలెను . ఒకసారి భావన చేయుటకు 24 గంటలు పట్టును .