సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు మీన సంక్రాంతి ఏర్పడుతుంది. సంవత్సరం లోని పన్నెండు మాసాలలో పన్నెండు రాశులలో కి సూర్యుడు ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించడం సంక్రమణం. కాబట్టి మనకు మాసానికొక సంక్రాంతి పండగ వస్తుంది. వాటిలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే మకర సంక్రాంతి తో మనం ఉత్తరాయణ పుణ్యకాలం లోకి ప్రవేశిస్తాం. అందుకే అన్ని సంక్రాంతులకన్నా మకర సంక్రాంతికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాం. మీన సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం లో వచ్చే చివరి సంక్రాంతి అందుకే మీన సంక్రాంతిని చాలా ప్రాంతాలలో విశిష్టంగా జరుపుకుంటారు. You Can Contact Omkaram Guruji 9059406999
మీన సంక్రాంతి రోజు చేయవలసిన పనులు
మీన సంక్రాంతినాడు సంధ్యా సమయం లో పితృ తర్పణాలను విడవడం పుణ్యదాయకం. తర్పణాలు విడిచిన వారికి వంశాభివృద్ధి కలుగుతుంది. పితృదేవతలకు ఊర్ధ్వలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజున చేసే దానాలకు విశేష ఫలితం ఉంటుంది. మీరు దానం చేసిన ధన ధాన్యాలు ఎన్నో రెట్లుగా మీకు తిరిగి లభిస్తాయి. చాలా ప్రాంతాలలో మీన సంక్రాంతి నాడు భూదానాలు చేస్తారు.