ఉత్తరాయణం ఎప్పటి నుండి ప్రారంభమౌతుంది? దక్షిణాయన పుణ్యకాలం లో ఏమి చెయ్యాలి ?

OMKARAMOmkaram Guruji Contact 9059406999

ఉత్తరాయణం ఎప్పటి నుండి ప్రారంభమౌతుంది? దక్షిణాయన పుణ్యకాలం లో ఏమి చెయ్యాలి ?

0 Comments

జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజు….

అసలు జ్యోతిషంలో ఒక్క గ్రహం రాశి మారటానికి
ఒక్కో కాల వ్యవధి వుంటుంది. Call Query Omkaram Guruji 9059406999
అంటే చంద్రుడు మేష రాశి నుంచి వృషభరాశికి మారటానికి 2 1/2 రోజులు పడుతుంది.
శనిగ్రహం 2 1/2 సం పడుతుంది.
రాహు , కేతువులకి 1 1/2 సం ,
రవికి నెల రోజులు…
ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి వుంటుంది.

అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కో రాశి చొప్పున (మేషాది మీన రాశులు) పన్నెండు రాశులలోనూ పన్నెండు నెలలు సంచరిస్తే మనకి సంవత్సర కాలం పూర్తవుతుంది.

జ్యోతిష పరిభాషలో…
సూర్యుడు మేషరాశి ప్రవేశాన్ని మేష సంక్రమణం అని

సూర్యుడు వృషభరాశి ప్రవేశాన్ని వృషభ సంక్రమణం అని

సూర్యుడు మిథునరాశి ప్రవేశాన్ని మిథున సంక్రమణంఅని

సూర్యుడు కర్కాటకరాశి ప్రవేశాన్ని కర్కాటక సంక్రమణం

ఇలా ఏయే రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెపుతారు.
సంక్రమణం అనే మాటకి జరగటం..ప్రవేశించటం
అని చెప్పొచ్చు.

సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసాడు అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు అని అర్ధం. ఇది జూలై 15 నుంచి 17 తేది వరకు జరుగుతూ వుంటుంది. సాధారణంగా జూలై 16వ తేదీనే !

ఈ కర్కాటక సంక్రమణాన్ని దక్షిణాయనమని అంటుంటారు.
(మనకి సంవత్సరానికి అయనములు రెండు.
ఒకటి ఉత్తరాయనం , రెండవది దక్షిణాయనం)
ఇక తర్వాత సూర్యుని సింహరాశి ప్రవేశం ,
తర్వాత కన్యారాశి ప్రవేశం (వినాయక చవితి వస్తుంది), తులారాశి ప్రవేశం (దసరాలు).
ఇలా పన్నెండు రాశులలోనూ సూర్యుడు ప్రవేశించే కాలాన్ని సంక్రమణంగా చెప్తాం.
(మకర సంక్రమణం (సం క్రాంతి)… మకరరాశి ప్రవేశం ! కుంభరాశి ప్రవేశం (మహా శివరాత్రి) అయితే
సూర్యుని మకర సంక్రమణమే ఉత్తరాయన పుణ్యకాలం.

ఏ తిథులతోను సంబంధం లేకుండాను ,
ఎవరినీ అడగక్కర్లేకుండాను సంవత్సరంలో వచ్చే పండుగలు ఉత్తరాయణ – దక్షిణాయన మనేవి.
జనవరి 14 న వచ్చే ఉత్తరాయణాన్ని
మకర సంక్రమణమనీ ,
జూలై 16 న వచ్చే దక్షిణాయనాన్ని
కర్కాటక సంక్రమణమనీ, వ్యవహరిస్తారు.
ఈ రెండు ఆయనాలు కలిపితేనే సంవత్సరం అవుతుంది.

సూర్యుడు ప్రతి నెలలోను ఒక రాశినుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. దీనికే సంక్రమణం అని పేరు.
సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటినుంచి మకరరాశిలోకి ప్రవేశించేంతవరకు వుండే కాలం దక్షిణాయనం.
ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు.

దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా ,
దక్షిణాయనం రాత్రిగాను చెప్తారు.
అదేవిధంగా ఉత్తరాయణం దేవతలకు ,
దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని చెబుతారు.

దక్షిణాయన సందర్భంగా సంక్రమణ స్నానాలు చేయడం , విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతోపాటు
శ్రీ వరాహస్వామి వారిని పూజించడం శ్రేష్టమని చెప్తారు.

దక్షిణాయన ఆరంభకాలమైన ఆషాఢంలో ఏ పండుగలు లేకపోయినా ఆ తర్వాత మాసాల్లో
శ్రీకృష్ణాష్టమి , వినాయక చవితి , రాఖీపూర్ణిమ ,
ఆదిపరాశక్తి మహిమలనుచాటే దసరా ,
నరక బాధలు తొలగించిన దీపావళి ,
శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక , మార్గశిర మాసాలు , గోపికలు ఆనంద పారవశ్యాన్ని పొందే ధనుర్మాసం
ఇవన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి.

ఆషాఢమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ఖచ్చితంగా జరుగుతుంది.
కర్కాటక రాశి ప్రవేశంతో దక్షిణాపథంవైపు సూర్యుడు పయనమవుతాడు.
దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి
ఆ పితృ దేవతలకు ఉత్తమమైనవి.
దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి
ఆ పితృదేవతలకు సకల నరకాలనుండి తొలగిస్తాయి.

దక్షిణాయనంలో దేవతా ప్రతిష్ఠ , గృహ ప్రవేశం. , ఉపనయనం , వివాహ కార్యాల్లాంటి శుభ కార్యాలను చేయడం మంచిది కాదంటారు.
కానీ దక్షిణాయనంలో ఉగ్రదేవతా రూపాలను అంటే
సప్త మాతృకలు , భైరవ , వరాహ , నృసింహ , మహిషాసుర మర్దని , దుర్గ లాంటి దేవతామూర్తులను ప్రతిష్టించవచ్చని వైఖానస సంహిత చెబుతోంది.

కర్కాటక సంక్రమణ సమయంలో అంటే దక్షిణాయన ప్రారంభంలో పుణ్య స్నానాలు , జపతపాలు చేయడం ఎంతో మంచిది.
ఆనాడు కులదైవాన్ని , లేదా శ్రీమహావిష్ణువును
పత్రాలతో పూజిస్తే ఆ ఏడాదంతా చేసిన దోషాలు ,
పాపాలు వైదొలగుతాయి.
వారి పితృదేవతలు స్వర్గాది సుఖలోకాలను చేరుకుంటారు.

సంక్రమణ కాలంలో చేసే పుణ్య స్నానాల వలన
రోగాలు నివారించబడడమే కాకుండా దారిద్య్రం కూడా నిర్మూలించబడుతుంది.
ముఖ్యంగా ఈ సంక్రమణ కాలం సాధకులకు
మంచి ఆధ్యాత్మిక ఫలితాలనిస్తుంది.
ఈ సమయంలో దానాలు కూడా విశేష ఫలాలనిస్తాయి.

అందుకే మోక్షానికి ఉత్తరాయణం ,
ఇహానికి దక్షిణాయనం ప్రతీకలుగా భావిస్తారు.

పుణ్యనదీ స్నాన , దాన , జప , హోమం
అక్షయ ఫలాన్ని ఇస్తుంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *