Omkaram Guruji Appointments

OMKARAMLatest News

Omkaram Guruji Appointments

0 Comments

వాస్తు శాస్త్రము నందు భూపరీక్ష విధానం – సంపూర్ణ వివరణ .

గృహనిర్మాణం చేయవలసిన భూమిని మొదట బాగుగా పరీక్ష చేయవలెను . భూపరీక్ష చేయక గృహనిర్మాణం చేసినచో సర్వము నిష్ఫలమగును. భూమి అంతయు ఒకేవిధముగా లేదు . కొన్ని స్థలములు చవిటినేలలు గాను , కొన్ని ఊట భూములుగాను , కొన్ని రాతి భూములుగాను ఉండును. అందుకే గృహనిర్మాణం చేయవలసిన భూమి అందుకు తగిన లక్షణములు కలిగి ఉన్నదో లేదో పరీక్షించి తరువాత గృహనిర్మాణం చేయవలెను అని మహర్షులు తెలియచేసారు. అందుకే మొదట స్థలపరీక్ష అవసరం.

  • స్థలపరీక్ష మొదట పద్దతి. – గృహము కట్టదలచిన స్థలములో ఒక హస్త ప్రమాణం ( మూరెడు ) లోతున చిన్న గొయ్యిని తవ్వి ఆ గోతినిండా సూర్యాస్తమయం అయిన తరువాత నీరుపోసి తరువాత ఉదయం చూసినయెడల కొంచెమైనను నీరు ఆ గోతిలో ఉన్న ఆ భూమి ఆ గృహనిర్మాణానికి ప్రశస్తమైనది. నీరు నిలవక బురద మాత్రమే ఉన్న ఆ భూమి మధ్యమమైనది , నీరు పూర్తిగా ఇంకిపోయి మన్ను పొడిపొడిగా లేదా భూమి నెర్రెలు కొట్టిన ఆ భూమి గృహనిర్మాణానికి పనికిరాదు . ఇదే పద్దతి భూమి యందు భూగర్భజలాన్ని కనుగొనుటకు కూడ వాడవచ్చు.
  • స్థలపరీక్ష రెండొవ పద్దతి. – గృహనిర్మాణం చేయదలచిన భూమి మధ్యభాగమున హస్తము లోతున ఒక గొయ్యి తవ్వవలెను . ఆ తవ్విన మన్నుతోనే మరలా ఆ గొయ్యిని పూడ్చవలెను . అలా పూడ్చగా మన్ను మిగిలినచో ఆ భూమి గృహనిర్మాణమునకు ప్రశస్తమైనదిగా తెలియును. మన్ను తక్కువ అయినచో ఆ స్థలము గృహనిర్మాణమునకు అనువైనది కాదు అని తెలుసుకోవలెను . మన్ను సరిపోయిన మధ్యమము . పైన తెలిపిన రెండు పద్ధతులు అందరు మహర్షులు అంగీకరించి ఉన్నారు. అలా గొయ్యి తవ్వుచున్న సమయంలో వివిధరకములు అయిన పురుగులు , కప్పలు , కీటకములు , ఊక , ఎముకలు , భస్మము మొదలైనవి కనపడుట యజమానికి మంచిది కాదు. బొగ్గులు , కాలిపోయిన కర్రలు , గవ్వలు మొదలైనవి కనపడిన స్థలము నందు గృహనిర్మాణం చేసి అందు నివసించుచున్న రోగములచేత , దరిద్రముచేత భాధలు పడుదురు. శల్యము ( ఎముక ) భూమి యందు ఆరు అడుగులకు పైగా లోతులో ఉన్నచో ఎటువంటి కీడూలేదని పురాతన వాస్తుశాస్త్ర గ్రంధాలలో ఉన్నది. దర్భలతో కూడుకొని ఉన్న భూమి గృహనిర్మాణానికి శుభప్రదమైనది. రక్తవర్ణం గల భూమి రాజ్యసంపదలు , వాహనయోగం కలిగించును. కాశిగడ్డివలె పచ్చటి భూమి విశేష ధనయోగమైనది. సాధారణ గడ్డితో కూడి ఉండు నల్లటి భూమి గృహనిర్మాణానికి యోగ్యమైనది కాదు. వాస్తుశాస్త్రం నందు భూపరీక్ష విధానం – సంపూర్ణ వివరణ – 2 . అంతకు ముందు పోస్టులో భూపరీక్షా విధానం గురించి తెలియచేసాను . ఇప్పుడు ఎటువంటి ప్రదేశాలలో గృహనిర్మాణం చేయవలెనో , ఎటువంటి ప్రదేశాలలో గృహనిర్మాణం చేయకూడదో , భూములలో రకాల గురించి సంపూర్ణంగా వివరిస్తాను.
  • మద్ది , రావి , తులసి , గరికె , విష్ణుక్రాంత , కొండగోగు , బూరుగ , సుగంధి , చిలుకలు , పావురములు , హంసలు మొదలైనవి కలిగి ఉండిన భూమి శైలభూమి అనబడును. ఈ భూమికి తూర్పు , ఉత్తరములలో నదీప్రవాహములు , చెరువులు , నూతులు , నీటితో ఉన్న గుంటలు ఉన్నచో శ్రేష్టము . అట్టి నీటివనరులు దక్షిణ పశ్చిమములలో ఉండరాదు. ఇట్టి భూమిలో ముండ్లతో ఉన్న చెడ్డ వృక్షములను తీసి గృహనిర్మాణం చేయుట ఐశ్వర్య ప్రదము.
  • బీటలు బారిన భూమి మరణము కలుగచేయును. పాముపుట్టలు కలిగిన భూమి ధననాశనము కలుగచేయును. శల్యములు కలిగిన భూమి నిత్యము నష్టములను కలుగచేయును. విషమాకారముగా ఉన్న భూమి శత్రుభయము కలుగచేయును.
  • పుర్రెలు , రాళ్లు , పురుగులు , పాముపుట్టలు , బొరియలు , గోతులు , ఎలుకలు , ఇసుక , పొట్టు , బొగ్గులు , వృక్షముల వేళ్ళు , బురద , పెంకు ముక్కలు , బూడిదతో ఉన్న భూములు , ముండ్లచెట్లు , కోట సమీప ప్రదేశములు , దుష్టమృగములు సంచరించు ప్రదేశములు , ఇనుము కరిగించి పనులు చేయు స్థలములు , నాలుగు వీధుల మధ్యస్థలము , వీధి శూలలు గల ప్రదేశములు గృహనిర్మాణానికి పనికిరావు. ధనక్షయం , కులక్షయం , నానావిధములు అయిన కష్టాలను కలుగచేయును .
  • బొంతజెముడు , ఇరుగుడు మొదలైన చెట్లతో , చిన్న ఇసుకరాయి గల భూములు , ఎక్కడ తవ్వినను నీటిజలాలు లేని భూములు ఆగ్నేయ భూములు అనబడును. ఇవి దరిద్రము కలుగచేయును .
  • నక్కలు , కంకరరాళ్ళు గల భూమి వాయువ్యభూమి అనబడును. ఇది గృహనిర్మాణానికి పనికిరాదు. దరిద్రము కలుగచేయును.
  • వృక్షములు కల భూమి వారుణ భూమి అనబడును. ఇందు గృహనిర్మాణం చేసి నివసించువారలకు సకల సంపదలు కలిగి అభివృద్ది దాయకంగా ఉండును.
  • ముండ్లు గల వృక్షములు , దొంగలు సంచరించు ప్రదేశములు , కారము , తీపివాసన గల భూములు , ఎక్కడ నిలబడిన తలనొప్పి వచ్చునో అట్టి భూములలో మానవులు గృహనిర్మాణం చేయరాదు . వాటిని రాక్షస భూములు అని పిలుస్తారు.
  • బూరుగచెట్టు , పొగడ , తాండ్ర, సరుగుడు చెట్లు , గాడిదలు , ఒంటెలు , పందులు , చండాలురు , చౌడునేలలు , దుర్వాసన కల భూములు పిశాచ భూములు అనబడును. ఇవి గృహనిర్మాణమునకు యోగ్యములు కావు. సర్వనాశనం కలుగచేయును .
  • చింత, బూరుగు , గానుగ , వెదురు , పత్తి , జిల్లేడు , దాసాని , ముళ్ళులేని వృక్షములు , హంసలు , సాధుజంతువులతో ఉన్న భూములు వైష్ణవభూములు అనబడును. ఇట్టి భూములకు ఉత్తరదిక్కున నదీప్రవాహములు , తటాకములు , నూతులు ఉండటం శ్రేష్టము .
  • అరటి , పనస, మామిడి , పొన్న , పొగడ , నెల్లి , వావిలి , పొదరి , నల్లకలువ , మొదలగు వృక్షములు ఉండి సువాసన గల భూములు ధన , ధాన్య సమృద్ధిని కలుగచేయును.
  • వావిలి , వసంత, గరిక , మోదుగ , తెల్లగన్నేరు , మల్లిక , ఉడుగ , ఇప్ప మొదలగు వృక్షములతో ఉండి బూడిద వాసన గల భూములయందు గృహనిర్మాణం చేసినచో అన్నవస్త్రములు , సుఖం , ఐశ్వర్యము కలుగును.
  • ఉడుగ చెట్లు , పిల్లులు , ముంగీసలు , కుందేళ్లు , చక్రవాక పక్షులు , తోడేళ్ళు గల భూములు , శౌర్య , వీర్య , సకలసంపదలు కలుగచేయును . వాస్తు శాస్త్రం అనేది మూఢనమ్మకం కాదు. మానవుడు తాను నిర్మించుకున్న గృహము నందు సుఖముగా , సంతోషముగా సరైన గాలి , వెలుతూరు వచ్చే విధముగా ఒక పద్దతి ప్రకారం ఎలా గృహనిర్మాణం చేయాలో మన పూర్వీకులు మనకు తెలియచేసిన గొప్పవరం ఈ వాస్తుశాస్త్రం.
#Vastu Omkaram Guruji
#Vastu Omkaram Guruji
#Vastu Omkaram Guruji
#Vastu Omkaram Guruji
#Vastu Omkaram Guruji


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *