కుప్పింట చెట్టుతో వైద్యం –

OMKARAMLatest News

కుప్పింట చెట్టుతో వైద్యం –

0 Comments

ఇది వర్షాకాలంలో ఖాళీ ప్రదేశాలలో బాగా పెరిగే చెట్టు. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒక జాతి యొక్క ఆకులు గుండ్రముగా ఉంటాయి. రెండోవది ఆకులు చివర కోణం కలిగి ఉండును. ఇవి రెండూ సమాన గుణాలు కలిగి ఉండును.

దీని ఉపయోగాలు మీకు వివరిస్తాను.
  • దీని ఆకులు 9, మిరియాలు 9, కొంచం హారతికర్పూరం ( ముద్ద కర్పూరం ) కలిపి నూరి శనగ గింజ అంత మాత్రలు కట్టి ఉదయం , సాయంత్రం నీటితో తీసుకుంటూ పథ్యం చేస్తూ పాలు తీసుకుంటూ ఉండిన కామెర్లు హరించును
  • దీని ఆకు , వేరు కలిపి కషాయం లా చేసుకుని తాగినా లేక చూర్ణం లోల్లికి తీసుకున్న మొలలు నివారణ అగును.
  • ఆకుల పసరు పూసిన చర్మరోగాలు నయం అగును.
  • దీని ఆకుల పసరు గేదెవెన్నలో కలిపి ఇచ్చిన మూర్ఛరోగం నివారణ అగును.
  • దీని వేరుతో దంతధావనం చేసిన దంతరోగాలు నశించును.
  • దీని ఆకు పసరు కండ్లలో లేక ముక్కులో పిండిన పిల్లలకు వచ్చు బాలపాపచిన్నెలు నివారణ అగును.
  • అదే పసరు చెవిలో పిండిన చెవిపోటు నివారణ అగును.
  • దీని ఆకుల రసం ఒక స్పూన్ లొపలికి ఇచ్చిన వాంతులు చేయను. లొపల పేరుకున్న శ్లేష్మం బయటకి పంపును. బ్రాంకైటిస్ అనగా వగర్పు గల దగ్గు నివారణ అగును.
  • దీని ఆకు నూరి కట్టిన వ్రణాలు మానును .
  • తేలు , జెర్రి , కందిరీగ , తేనెటీగ కుట్టిన వెంటనే ఈ ఆకు వేసి కట్టు కట్టిన బాధ నివారణ అగును.
  • గోరుచుట్టు లేచినప్పుడు దీని ఆకు , వెల్లుల్లిపాయ , తమలపాకు కలిపి నూరి కట్టిన అది పగిలి మానిపోవును .
  • పుప్పిపంటికి దీని ఆకు నలిపి పుప్పిపంటిలో ఉంచిన బాధ తగ్గిపొవును.
  • పురుగులు పట్టిన వ్రణములకు మొక్కని నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి ఆ చూర్ణం చల్లిన పురుగులు నశించి పుండ్లు మానును .
  • దీని చూర్ణం నస్యం వలే లొపలికి పీల్చిన మెదడులో గడ్డకట్టిన రక్తం కరుగును.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *