పైన చెప్పినవిధముగా విరుద్ధమైన ఆహారం , పనులు చేయుటవలన శరీరంలో చర్మము , రక్తము , మాంసము , లింప్ గ్రంథులు దోషమును పొంది రకరకాల చర్మవ్యాధులు కలుగును. చర్మవ్యాధులు రావడానికి పూర్వము కనిపించు లక్షణములు –శరీరము నందలి వ్యర్ధపదార్ధముల వలన చర్మవ్యాధులు వచ్చును . కాబట్టి వానిని వివిధరకాల పద్ధతుల ద్వారా వాంతి , విరేచనం మొదలగు శోధన పద్ధతులను ఉపయోగించి వ్యర్ధాలను బయటకి పంపుతూ ఔషధాలను ఇయ్యవలెను . చర్మవ్యాధుల యందు పథ్యము –పైన చెప్పిన పదార్ధాలు ఆహారంలో తప్పక భాగం చేసుకొనవలెను . చర్మవ్యాధుల యందు అపథ్యము –పైన చెప్పినవిధముగా ఆహారపు అలవాట్లు పాటిస్తూ సరైన వైద్యుడి పర్యవేక్షణలో ఔషధాలు సేవించుచున్న చర్మవ్యాధుల నుంచి త్వరగా బయటపడగలరు. ఇక్కడ మనం ముఖ్యముగా గుర్తు ఉంచుకోవాల్సిన విషయము ఏమిటంటే వ్యాధి సంప్రాప్తినిచ్చిన తరువాత ఔషధాలు సేవించుట కంటే వ్యాధి రాకుండా చూసుకోవడమే అత్యంత ప్రధానమైనది.