అంతా చైతన్యమే….దీనినే ‘మూల శక్తి ‘ దైవ శక్తి ‘ మూల చైతన్య శక్తి’ ఆదిపరా శక్తి’ అని పిలుస్తారు..నిజానికి ఇది ఒక ‘విద్యుత్ అయస్కాంత శక్తి’ ఈ శక్తిలోనే అనంతమైన సమాచారం దాగి ఉంది….
ఓంకార సాధన #Omkaramgurujicontact9059406999 (సిద్దమంత్ర సాధనతో సకల సమస్యలు తొలిగిపోతాయి)
ఈ శక్తి సృష్టి అంతా వ్యాపించి ఉన్నప్పటికీ,ఈ శక్తిలో కేవలం అతి తక్కువ భాగం మాత్రమె మానవుడికి అందుబాటులో ఉంది…ఎందుకంటే ఈ శక్తి వివిధ స్తాయిలలో విరాజిల్లుతూ ఉంది కనుక..ఏ స్తాయి లో ఉన్న జీవరాసి ఆ స్తాయి శక్తిని మాత్రమే తీసుకునే సామర్థం ఉంటుంది…అలా స్వీకరించిన శక్తి ఆ జీవి పరిణామ క్రమానికి ఉపయోగ పడుతుంది…
అయితే ఈ శక్తి లోని దివ్య సమాచారం జీవి పరిణామ క్రమములో తదుపరి దశలోకి కుడా ప్రవేసింపచేయగలదు.
దీని కొరకు ఆ జీవి పూర్తీ ఎరుకతో తదుపరి వాస్తవాన్ని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది…..ఈ విధంగా ప్రతి జీవి ఈ శక్తి ద్వారానే ఎదుగుతూ, ఒకదశలో ఇతర జీవరాశికి కుడా ఎదుగుదలలో తన సహాయము అందించగలుగుతుంది…
మానవుడు చైతన్య శక్తి లోని సమాచారాన్ని అవగాహనా చేసుకోకుండా ఉన్నపుడు …ఆ శక్తి ద్వారానే లయం చేయ బడతాడు…..
ఈ చైతన్య శక్తిని అర్థం చేసుకున్నపుడు ….చైతన్య పరిణామం వేగవంతమవుతుంది….మానవుడు ఒక జ్ఞానవంతుడిగా మారతాడు….
కాంతి తన లోని 7 రంగులతో ఏ విధంగా అయితే కొన్ని వేల రంగులుగా పరావర్తనం చెందగలదో ….అదే విధంగా చైతన్య శక్తియే ‘జీవితం’గా పరివర్తితము అవుతుంది….ఈ చైతన్య శక్తి లోనే సమస్త జీవిత నియమాలు,విశ్వ నియమాలు, బ్రహ్మాండ నియమాలు దాగి ఉన్నాయి….వీటి అవగాహన తోటి మానవుడు ఒక విశ్వ మానవుడిగా ఎదుగుతాడు….
ఈ చైతన్య శక్తిని మనలో పెంచుకోవటానికి నిరంతరం సృష్టి నుంచి సహకారం అందుతూనే ఉంటుంది…జీవితం ‘చైతన్యం’ యొక్క మరో రూపమే అని తెలియనపుడు, మానవ జీవితం యాంత్రికంగా ఉంటుంది….మన చైతన్యం లోని సమాచారమే మనం ఎదిగేల పరిస్తితులను కల్పిస్తుంది…..అవి మన అవగాహనకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉండవచ్చు కాని, ఆ పరిస్తితులే మన చైతన్యస్తాయిని పెంచటానికి ఉపయోగ పడతాయి…
చైతన్యం ముఖ్యంగా రెండు రకాలుగా విభజింపబడింది…
ఒకటి వ్యక్తిగత చైతన్యం
రెండు సామూహిక చైతన్యం
వ్యక్తిగత చైతన్యం యొక ప్రభావం సాముహిక చైతన్యం మీద,
సాముహిక చైతన్యం యొక్క ప్రభావం వ్యక్తిగత చైతన్యం మీద ఉంటుంది…ఇదంతా చైతన్యపు విస్తరణ కోసమే…..అంటే ఎదుగుదల కోసమే….
అలాగే మానవ చైతన్యంలో అంతః చేతన,బాహ్యచేతన ఉంటాయి…ఈ రెండు చేతనలు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడే ముక్తి…ఇదే మానవ జన్మ లక్షం….
అంతః చేతనలో అనంతమైన సమాచారం
బాహ్య చేతనలో ఈ జన్మలో నేర్చుకున్నటువంటి సమాచారం దాగి ఉంది…..
సాధారణ మానవుడు బాహ్య చేతన తోటే …జీవితం అంతా ఉండి పరిమిత జీవితాన్నే గడుపుతాడు….. అంతః చేతనలోని జ్ఞానాన్ని పొందాలంటే అతను ధ్యానం చేయాలి….ధ్యానం ద్వారా అంతః చేతనలోని జ్ఞానం, బాహ్య చేతనలోకి వస్తుంది….తద్వారా అతను జ్ఞానోదయాన్ని పొందుతాడు…ఇదే ముక్తి అంటే…