దాల్చినచెక్క నూనె తేలు కుట్టినచోట దూదిలో ముంచి పెట్టిన నొప్పి తగ్గును.
గుగ్గిలం పొడి తేలు కుట్టినచోట పెట్టి నిప్పు వేడి చూపించిన విషాన్ని లాగేస్తుంది.
జీలకర్ర నూరి తేలు కుట్టినచోట అంటించిన నిప్పువేడి చూపిన విషం తగ్గును.
కుంకుడుకాయ తడిపి దాని గుజ్జుతో తేలుకుట్టిన చోట రుద్దిన బాధ తగ్గును.
ఎర్ర చేమంతి పువ్వుల రసం తేలు కుట్టినచోట వేస్తే విషప్రభావం దిగును .
గచ్చకాయలోని పప్పు నీళ్లతో అరగదీసి ఆ గంధమును తేలు కుట్టినచోట వేసి ఒక కాటన్ బట్ట కాల్చి ఆ పొగ గంథం పూసిన చోట చూపించవలెను.ఈ విధంగా చేసిన తేలు విషం దిగును .
ఇంగువను నీళ్లతో అరగదీసి ఆ గంధమును తేలు కుట్టినచోట దళసరిగా పూసి గుడ్డ ముక్క కాల్చి ఆ పొగ చూపించిన విషం దిగును .