??అరుణాచలం??

OMKARAM GurujiLatest News

??అరుణాచలం??

0 Comments

అరుణాచలం ఈ పేరే ఒక మాయ ఒక అద్భుతం అక్కడికి వెళ్లినవారికి ఏమవుతుందనేది తెలియదు కానీ ఆ కొండ అయస్కాంత శక్తిలాగా లాగేస్తుంది అక్కడే ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు అనిపిస్తుంది.
omkaram మంత్ర సాధన #Omkaramguruji9059406999(పరమశివుడి మంత్ర సాధానతో సకల సమస్యలు తొలిగిపోతాయి)

మనసు అరుణాచలశివ అంటూ ధ్యానం చేస్తుంటుంది, ఆ గిరి 260 కోట్ల సంవత్సరములుగా ఉంది అని పురావాస్తు శాఖ వారు నిర్ధారించారు.. ఆ కొండ రూపంలో దక్షిణామూర్తి ఉంటారు సాక్షాత్తు స్వామి అమ్మవారు అర్ధనారీశ్వరరూపంలో ఉన్నారు అక్కడ, మనం అక్కడ అప్రయత్నంగానే ధ్యానంలోకి వెళ్లిపోతాము సమయం తెలియకుండా ఎంత సేపయినా అలా ధ్యానంలో ఉండిపోవచ్చు, భవబంధాలు గుర్తుకు రావు, బాహ్యసృహా ఉండదు. అలా ధ్యానంలో ఉన్న సమయంలో ఎందరో సిద్ధులు, అక్కడ సంచరిస్తున్న ఆశరీరుల దర్శనం, వారి వాక్కు కూడా మన మనో చక్షువులచే వినవచ్చు .

ఆ స్థలంకి ఉన్న శక్తి అలాంటిది. మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు, మనస్సును ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్లిపోతుంది అక్కడి వాతావరణం, అన్నీ మర్చిపోయి అరుణాచల శివ అనే మాయలోకి మునిగిపోతాము.. ఆ మాయ ఎప్పటికి వదలదు , మాయ అని ఎందుకు అంటున్నాను అంటే అప్పటి వరకు గడిచిన జీవితాన్ని అక్కడ అడుగు పెట్టాక మర్చిపోతాము, అరుణాచలంలో అడుగు పెట్టాక అక్కడి నుండి జీవితం కొత్తగా మొదలు అవుతుంది అదే మెదలు అదే చివర అనే ధ్యాసకు లోనవుతుంది మనసు, అంతే ఆ మాయలో జీవితకాలం మొత్తం కూడా గడిచిపోవచ్చు..

ఎందరో నాస్తికులు కూడా కుతూహలంతో ఆ గిరి ప్రదక్షిణ చేసి అక్కడ ఏదో మాయ ఒక మహా శక్తిలాగా మనసులాగేస్తుందని అని కారణం తెలియని ఆనందాన్ని పొందుతామని చెప్పిన సంఘటనలు ఉన్నాయి , దేవుడికి దండం పెట్టని వారు కూడా దాసోహం అంటూ ఆ కొండ చుట్టూ పడి దొర్లేస్తారు ఆ స్వామి కరుణామయుడు నాస్తికులకే అంత అనుభూతి కలిగితే భక్తుల పరిస్థితి ఎలా ఉంటుంది అడుగడుగునా శివ దర్శనం నిదర్శనం కనపడుతూనే ఉంటుంది..

‘అరుణాచలం’ అనే పదానికి ఎవరి అవగాహనను బట్టి వారు అనేక అర్ధాలను చెప్పుకున్నారు.
అరుణాచలం అంటే ఆగమ ప్రధానులు అరుణాచలేశ్వర దేవాలయములో ప్రతిష్ఠింపబడిన శివలింగం. పౌరాణికులకు అరుణాచల పర్వతం భక్తులకు శివ స్వరూపం.యోగులకు పరంజ్యోతి దానికి అతీతం కూడా. జ్ఞానోపాసకులకు హృదయస్తుడైన పురుషుడు. నిర్గుణ అభిమానులకు నిష్కల జ్యోతి. భూతత్వ పరిశోధకులకు అతి ప్రాచీన మైన కొండ ఇలా ఎన్నో… ఎన్నెన్నో అర్థాలను చెబుతున్నారు.

కానీ…
భగవాన్‌ శ్రీ రమణ మహర్షి వాక్కుల కు వేరే ప్రమాణముల ఆవశ్యకత లేదు. వారు అనేక పర్యాయములు అరుణాచలం గురించి ప్రస్తావించడం జరిగింది. అరుణాచలం సాక్షాత్తు కైలాసమే అన్నారు. ఈ క్షేత్రములో ప్రతి శిలా శివలింగమే. ఈ క్షేత్రములో తీసుకొన్న ఆహారము, నీరు అమృతమే. ఈ క్షేత్రములో ఏమి మాట్లాడుకున్నా శివ స్తోత్రమే. ఈ క్షేత్రంలో ఏ కర్మ చేసినా అది శివ పూజయే. గిరి ప్రద క్షిణ చేస్తే మొత్తం సృష్టిని చుట్టి వచ్చినట్లే. గిరిచుట్టూ ఉన్న 24 మైళ్ళలోపు ఎక్కడ మరణించినా వారికి ముక్తి కలుగుతుంది. కమలాలయమును తిరువారూర్‌ నందు జన్మించినచో ముక్తి కలుగుతుంది. అలాగే కాశీ క్షేత్రములో మరణిస్తే ముక్తి కలుగుతుంది. కానీ అరుణాచలములో పుట్టడం, మరణిం చడం జరిగితే ముక్తి కలగడంతోపాటు అరుణాచలమును స్మరిస్తే చాలు ముక్తి కలుగుతుంది. దీనిని బట్టి అరుణాచలం ఎంత గొప్ప విశిష్టత కలిగిన క్షేత్రమో తెలుస్తున్నది. మిగిలిన అన్ని గిరులను ఒక దేవతకు నివాస స్థానాలుగా వర్ణించారు.

అరుణాచలాన్ని మాత్రం గిరి రూపంలో నున్న దేవుడే అంటారు. మనం దేహంతో తాదాత్మ్యం చెందినట్లే పరమ శివుడు ఈ కొండతో తాదాత్యము చెందాడు. అందువల్ల ఈ కొండ పరమశివుడే. తనను అన్వేషించే భక్తులపై కరుణతో వాళ్లకు కనపడాలని శివుడు కొండ రూపం దాల్చాడు.

ఎంతో మంది అక్కడి నుండి రాలేక అరుణగిరికి దూరంగా ఉండలేక అక్కడే స్థిరపడిపోయారు.. ఒక మైనింగ్ వ్యాపారం చేసే ఆవిడ యిరువది సంవత్సరములుగా అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ నుండే తన వ్యాపార పనులు చేసుకుంటూ ప్రతి రోజూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఇంకొకరు పన్నెండు సంవత్సరములుగా అక్కడే నివాసం ఉంటున్నారుడు, అక్కడి వాస్తవ్యులు కొందరు ప్రతిరోజూ గిరి ప్రదక్షిణ దీక్షగా చేస్తున్నారు.. ఎందరో అక్కడ స్థిరపడ్డారు నిత్యం ఆ కొండను దర్శించి పునీతులవుతున్నారు, వారి లక్ష్యం ఒక్కటే బతికి ఉన్నంత కాలం అలా ప్రదక్షిణ చేసుకుంటూ అక్కడే ప్రాణం వదిలేయడం శివైక్యం పొందటం..

గిరి ప్రదక్షిణ శ్రద్ధగా చేయాలి భక్తితో ఆనందిస్తూ చేయాలి అడుగడుగునా మహమాయని అనుభూతి చెందుతూ చేయాలి, వ్యర్ధప్రేలాపన చేయకూడదు సమయం వినియోగించుకోవాలి. ఇది అక్కడ ఉండే వారి కోరిక.?

?సర్వేజనాసుఖినోభవంతు ?

#OmkaramgurjiContact9059406999


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *