కొంతకాలం క్రితం అశ్వగంధ గురించి కొన్ని వివరాలు మీకు అందించాను. ఈ మధ్యకాలంలో అశ్వగంధ గురించి మరింత విలువైన సమాచారం తెలుసుకున్నాను . వీటిలో చాలా వరకు నేను నా పేషెంట్స్ కి ఇచ్చినప్పుడు కొన్ని ఇతర సమస్యలు తీరడం నా దృష్టికి వచ్చింది. ఇప్పుడు నా స్వానుభావాలు మరియు కొన్ని అత్యంత పురాతన గ్రంథ పరిశోధనలో నాకు లభ్యమైనవి కూడా మీకు వివరిస్తాను .
స్వచ్ఛమైన అశ్వగంధ తయారీ విధానం – Contact Omkaram Ayur Xemam 9059406999
మెట్టభూములు మరియు అడవులలో లభ్యమగు మంచి ముదురు పెన్నేరు గడ్డలను తెచ్చి మట్టి , ఇసుక , దుమ్ము వంటి వ్యర్థపదార్థాలు లేకుండా శుభ్రపరచుకొని నీడ యందు ఎండించవలెను . పూర్తిగా ఎండిన తరువాత కత్తితో ముక్కలుగా కొట్టి ఒక గిన్నెలో వేసి అవి మునుగునంత వరకు దేశి ఆవుపాలు పోసి సన్నటిసెగపైన పాలు ఇగురునంత వరకు ఉడికించవలెను . అలా ఉడికించిన తరువాత గడ్డలను బాగుగా ఎండించవలెను . ఆ దుంపల యందు తడి పూర్తిగా ఆరిపోయేంత వరకు ఎండించవలెను . లేనిచో ఆ దుంపలకు బూజు పట్టును . ఇలా పూర్తిగా ఎండిన దుంపలను మరలా ఉడికించి ఎండించవలెను . ఇలా మొత్తం 11 సార్లు చేసి ఆ తరువాత బాగుగా ఎండించి చూర్ణం చేసి వస్త్రగాలితం చేసుకుని వచ్చిన మెత్తటి చూర్ణాన్ని తడి తగలకుండా జాగ్రత్తగా నిలువచేసుకోవలెను .
మోతాదు –
2 నుంచి 3 గ్రాముల మోతాదులో ఉదయము మరియు సాయంత్రం భోజనానికి అరగంట ముందు ఆయా సమస్యను బట్టి వైద్యులు సూచించిన అనుపానంతో వాడవలెను .
అశ్వగంధ 7 సార్లు శుద్ది చేయవలెను అని చెప్పుదురు . 11 సార్లు శుద్ది చేసిన ప్రశస్తముగా ఉండును . మరియు బలంగా పనిచేయును .
ఔషధోపయోగాలు –
- శరీరానికి అమితమైన బలాన్ని ఇచ్చును . శుష్కించు శరీరం కలవారు దీనిని వాడుట వలన శరీరానికి కండపట్టి బలంగా తయారగుదురు .
- నిద్రలేమితో బాధపడువారికి ఈ అశ్వగంధ అత్యంతద్భుతముగా పనిచేయును . అశ్వగంధ ప్రధానముగా నరాల మీద పనిచేసి నరాలకు బలాన్ని చేకూర్చును . దీనిని వాడుట వలన ప్రశాంతమైన నిద్ర లభించును .
- క్షయరోగముతో ఇబ్బంది పడువారికి ఇది అత్యంత బలవర్ధకమైనది . ఊపిరితిత్తులకు బలాన్ని చేకూర్చుటయే కాక శరీర రోగనిరోధక శక్తి పెంచుటలో అత్యంత వేగముగా పనిచేయును .
- విరిగిన ఎముకలు త్వరగా కట్టుకొనుటకు ఈ అశ్వగంధ బాగుగా పనిచేయును .
- స్త్రీలు మరియు పురుషలలో కలుగు వంద్యదోషాలను నివారించును .
- రక్తము నందలి దోషములను పోగొట్టును .
- కీళ్లనొప్పులు నుంచి ఉపశమనం కలిగించును .
- నాడీవ్యవస్థ కు చెందిన వ్యాధుల పైన బాగుగా పనిచేయును .
- పక్షవాతం మొదలగు వాతవ్యాధుల యందు దీని పనితీరు అద్బుతముగా ఉంటుంది .
- మెదడులోని న్యూరాన్ల పైన దీని ప్రభావం ఉంటుంది. దీనిని వాడుట మూలన మెదడు చురుకుగా పనిచేయును . జ్ఞాపకశక్తి మెరుగుపడును .
- అగ్నిమాంద్యము , మలబద్దకం నివారించును .
- బాలింతలకు వచ్చు సూతికారోగము నివారించును .
- శరీరంలోని టాక్సిన్స్ బయటకి పంపి శరీరాన్ని శుద్ది చేయును .
- కఫ సంబంధ దోషములైన శ్వాస ( ఆయాసం ) , శోష మొదలైన వాటిని నివారించును .
- గ్రంధి సంబంధ రోగాలు ఉదాహరణకి థైరాయిడ్ వంటి వాటిపై అమోఘముగా పనిచేయును .
- గుండెసంబంధ సమస్యల కలవారు అశ్వగంధ వాడవలెను .
- కొంతమంది పిల్లలు శారీరకంగా ఎండుకుపోయి ఉంటారు. అటువంటివారికి తేనె అనుపానంగా ఈ అశ్వగంధ చూర్ణమును ఇచ్చిన మంచి కండపట్టి పుష్టిగా తయారగుదురు .
- వృద్ధాప్యము నందు వచ్చు సమస్యలను ఎదుర్కోవడానికి అశ్వగంధ నిత్యము సేవించవలెను .
- స్త్రీల శారీరక బలహీనతని పోగొట్టును . ప్రదర రోగములను నివారించును .
- మూర్చరోగులకు ఇది వరం వంటిది .
- స్త్రీలలో కలుగు బహిష్టు సంబంధ సమస్యలను నివారించును .
- స్త్రీ మరియు పురుషులలో హార్మోన్స్ మీద ఇది చాలా అద్బుతముగా పనిచేయును .
Ashwagandha Powder benefits
Ashwagandha is an herb that is commonly used in Ayurvedic medicine, a traditional system of medicine that originated in India. It is also known as Withania somnifera or Indian ginseng. Some potential benefits of ashwagandha powder include reducing stress and anxiety, improving brain function, reducing inflammation, and lowering cholesterol levels. It may also have anti-tumor effects and may be useful in treating sexual dysfunction and infertility. However, it is important to note that more research is needed to fully understand the effects of ashwagandha and to determine the appropriate dosage and duration of use. As with any supplement, it is important to talk to a healthcare provider before taking ashwagandha to ensure it is safe and appropriate for you.