అల్లం గురించి సంపూర్ణ వివరణ – ఉపయోగాలు .

OMKARAMLatest News

అల్లం గురించి సంపూర్ణ వివరణ – ఉపయోగాలు .

0 Comments

సంస్కృతంలో అల్లమును “విశ్వాఔషధ” అని అంటారు. ఇది వాతాన్ని తగ్గిస్తుంది . జీర్ణకరము , విరేచనకారి , కళ్లు , గొంతుకు మంచిది . దీని విరేచనగుణం వలన పేగులలో పురుగులను నాశనం చేస్తుంది . అలా నాశనం అయిన క్రిములు మూత్రము ద్వారా బయటకి విసర్జించబడతాయి. పేగులకు అల్లం మంచి టానిక్ లాగా పనిచేస్తుంది . దీనిని వాడటం వలన ఇటువంటి సైడ్ ఎఫక్ట్స్ ఉండవు.

     అల్లము నందు విటమిన్ A , మరియు విటమిన్ C , ఫాస్ఫరస్ కొంత మోతాదులో ఉంటుంది. భోజనం తీసుకోవడానికి గంట ముందు చాలా చిన్నమొత్తంలో మినరల్ సాల్ట్ , నిమ్మకాయ రసం కొన్ని చుక్కలు , నాలుగు స్పూనుల అల్లం రసం కలిపి లోపలికి తీసుకుంటే ఆకలిని అద్భుతముగా పెంచును. గ్యాస్ సమస్య కూడా పరిష్కారం అగును. దగ్గు , జలుబు , రొంప మొదలయిన సమస్యలతో బాధపడేవారు అల్లం వాడటం వలన సమస్య నుంచి తొందరగా బయటపడతారు. గుండెజబ్బు ఉన్నవారు తరచుగా అల్లం వాడటం చాలా మంచిది . అన్ని రకాల ఉదరవ్యాధులకు అల్లం చాలా మంచి పరిష్కారం చూపిస్తుంది.

       అల్లం రసం ప్రతినిత్యం తీసుకోవడం వలన మూత్రసంబంధ సమస్యలు , కామెర్లు , మూలశంఖ , ఆస్తమా , దగ్గు , నీరుపట్టడం వంటి సమస్యలు త్వరగా నయం అగును. ఔషధాలు సేవిస్తూ అల్లంకూడా వాడటం వలన త్వరగా ప్రయోజనం చేకూరును . ఆయుర్వేదం ప్రకారం అల్లాన్ని ప్రతినిత్యం తీసుకోవడం వలన గొంతు , నాలుక సంబంధ సమస్యలకు అద్భుతముగా పనిచేయును . తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నప్పుడు అల్లంరసం ముక్కులో వేయుచున్న తలనొప్పి తగ్గును. పంటినొప్పితో బాధపడుతున్నప్పుడు పంటిపైన అల్లం ముక్కతో రుద్దిన నొప్పి తగ్గును. సైనసైటిస్ నుంచి కూడా విముక్తి లభించును.Omkaram Guruji Contact 9059406999
Omkaram Guruji Conatct 9059406999


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *