కర్మకాండ ఆచరణకు సంబంధించినది…
జ్ఞానకాండ అనుభవానికి సంబంధించినది…
ఒకటి సాంఘీకం.
ఇంకొకటి ఆధ్యాత్మికం.
మతభేదాలుండేది కర్మకాండలోనే.
అనుభవంలో ఏ తేడాలూ ఉండవు.
అక్కడ అన్ని మతాలూ ఒక్కటే.
అసలక్కడ ఏ మతమూ ఉండదు.
ఒక్కొక్క చోట ఒక్కొక్కరికి ఒక్కోరకమైన ఆహారం ఉంటుంది.
అందరికీ ఆకలి తీరాక ఉండే తృప్తి ఒక్కటే.
ఏదో ఒక మతస్తుడిగా పుట్టడం సహజం.
అదే మతస్తుడిగా చనిపోవడం దురదృష్టకరం.
మతాతీతుడు కావాలన్నదే సారాంశం.
అటువంటి అద్వైతస్థితికి ప్రతి ఒక్కరూ చేరాలన్నదే
ప్రతి మతం యొక్క అభిమతం.
మనమందరం కర్మకాండ వద్దనే ఆగిపోయి కొట్టుకు చస్తున్నాం…
భౌతిక-మానసిన పరిధులను దాటి, ఏకాత్మస్థితికి ప్రయాణించాలి.
నా పడవ గొప్పదా?
నీ పడవ గొప్పదా?
అని గొడవ పడుతూ
ఇవతలి గట్టు మీదనే కాలాన్ని వ్యర్థం చేస్తున్నాం.
సోదరా! ఏ పడవైనా ఒకటే…
అవతలి గట్టుకు చేరడం ప్రధానం.
మతశాఖలు ఎన్నైనా ఉండొచ్చు
మతభేధాలు ఉండకూడదు.
ముందు నీ మతం నీకు అర్థమై…
అనుభవంలోకి వస్తే…
తర్వాత నీ మతస్తుడు కానివాడు అంటూ నీకు కనిపించడు.
ఏ మతమైనా సరే…
ఆచరణకు మించిన ప్రచారం లేదు.
నీ మతాన్ని నీవొక్కడివి పరిపూర్ణంగా ఆచరిస్తే చాలు…
ప్రపంచమంతా నీ వెనుకే నడుస్తుంది…
ప్రపంచమే కాదు…
ఆ దేవుడు కూడా నీ వెనుకే నడుస్తాడు…☀️