తేళ్లు కీటకముల జాతికి చెందినవి . అన్ని రకముల కీటకాలకు ముఖము నందు ఉండును. తేళ్లకు మాత్రం తోకచివర ఉండు కొండి యందు విషం ఉండును. శుశ్రుతుడు తేళ్ళలో మరొక రెండు రకాల జాతుల గురించి కూడా వివరించాడు. అందులో మొదటిది పత్ర తేలు రెండోవది మండ్రగబ్బ . మండ్రగబ్బ తేలు కంటే రెట్టింపు పరిమాణంలో ఉండును. అయితే తేలు తోక చివర కొండితో కాటువేయును కాని మండ్రగబ్బ నోటితో కరుచుట వలన విషాన్ని వదులును.
తేళ్ళలో పుట్టిన ప్రదేశం మరియు విషం యొక్క తీవ్రతని బట్టి మన ప్రాచీన వైద్యులు మూడు రకాలుగా విభజించారు . అవి 1 – మంద విషము కలిగినవి.
2 – మధ్యవిషము కలిగినవి.
3 – తీవ్రవిషము కలిగినవి.
ఈ జాతిలో 12 రకాలు కలవు. ఇవి ఎక్కువుగా ఆవులు , గేదెలు మొదలగువాని మలములు బాగా కుళ్లిపోయిన వాని యందు పుట్టును . ఇవి కుట్టినచో బాధ , వణుకు , శరీరం మొద్దుబారుట , కుట్టిన ప్రదేశములో రక్తస్రావం కలుగును. కుట్టిన ప్రదేశము నుండి విషము పైకి ఎక్కును . మంట , వాపు , జ్వరం కలుగును. చమట పట్టును . వీటి పొట్ట కింద భాగములో పసుపు , నలుపు , నీలం , పొగ రంగు , గోమూత్రపు రంగు , ఆకుపచ్చ రంగు , తెలుపు రంగు కలిగి ఉండును. పొట్ట కింద మెరియుట , రోమములు కలిగి ఉండును. వీని తోక యందు కణుపులు ఎక్కువుగా ఉండును. మూడు కణుపుల కంటే ఎక్కువ కణుపులు కలిగి ఉండును.ఈ జాతిలో 3 రకాల తేళ్లు కలవు. ఇవి ఎక్కువుగా , వాములు , కర్రల గుట్టల యందు ఉండును. విషము కలిగిన ఆయుధములు చే కొట్టబడటం వలన గాని లేక విషజంతువుల చే కరవబడటం వలన గాని చనిపోయిన జంతువుల శరీరముల నుంచి ఇవి పుట్టును . ఇవి కుట్టినచో నాలిక వాయుట , భోజనము చేయలేకపోవుట , మూర్చ కలుగును. కుట్టిన ప్రదేశము నుండి విషము పైకి ఎక్కును. వీటి పొట్ట కింద భాగము నందు పసుపు , నలుపు , ఎరుపు రంగు కలిగి ఉండును. వీని తోక యందు మూడు కణుపులు ఉండును.ఈ జాతిలో 15 రకాలు ఉండును. ఇవి ఎక్కువుగా చనిపోయిన పాములు మొదలగు విష జంతువుల శరీరములు బాగా కుళ్లిపోయిన తరువాత ఆ శరీర భాగాల నుంచి పుట్టును . ఈ తేళ్లు కుట్టిన వెంటనే సర్పవిషము వలనే వేగముగా పైకి ఎక్కును . శరీరము నందు బొబ్బలు , జ్వరం కలుగును. అతి నీరసము వచ్చును. ఇంద్రియాల నుండి నల్లని నెత్తురు స్రవించి ప్రాణములు పోవచ్చును.వీటి పొట్ట కింద ఎరుపు , తెలుపు , పొగ రంగు , నీలము , గులాబీ మొదలగు రంగురంగులు కలిగి ఉండును. దీని తోక యందు ఒక కణుపు గాని , రెండు కణుపులు గాని , లేక అసలు కణుపుల లేకుండా గాని ఉండును. పైన చెప్పినవాటితో పాటు శుశృతుడు వివరించిన రెండు రకాల తేళ్ల గురించి కూడా వివరిస్తాను.ఇది ఆకువలనే పలచని ఆకారం కలిగి ఉండును. ఇది కుట్టినచో ఆ ప్రదేశము నందు ఎర్రబడి , బొబ్బలు పొక్కి , నిప్పుతో కాల్చినట్లుగా బాధ పెట్టును.ఇది చూడటానికి తేలు వలే ఉండును కాని పరిమాణంలో పెద్దదిగా ఉండును. ఇవి నలుపు , ఎరుపు రంగులు కలిగి ఉండును. వీటికి విషము నోటి యందు ఉండును. ఇవి కరిచినచో రోగి రోమములు నిక్కబొడుచుకొని ఉండును. శరీరం చల్లబడును చమటలు కారును . పురుషాంగం స్థంభించును. కరిచిన గాయం నుండి నల్లగా రక్తం కారును .తేలు కుట్టిన వెంటనే సూదితో గుచ్చినట్లు ఉండి కొండి యందలి రంధ్రము ద్వారా విషము శరీరంలోనికి ప్రవేశించి ఆ ప్రాంతము అంతా నిప్పుతో కాల్చినట్లు మంట కలుగును. కాళ్ళు , చేతుల యందు కుట్టినచో విషము గజ్జలు , చంకల వరకు వ్యాపించి కొంతసేపు ఉండి మరలా కాటు ప్రదేశమును చేరును . అచ్చట 24 గంటల కాలము పోటు , నొప్పి , పగలగొట్టుచున్నట్లు బాధ కలుగును. దీని విషము పూర్తిగా రక్తములోకి ప్రవేశించక పోయినప్పటికీ తేలు విషము నందు ఆమ్ల ,తీక్ష , ఉష్ణ గుణములు ఉండుటచేత చర్మము కిందనే ఉండి మంట, పోటు కలిగించును. తేలు కుట్టినప్పుడు చేయవలసిన చికిత్సలు –ఇప్పుడు మీకు తేలు కుట్టినప్పుడు ఏయే లక్షణాలు కనిపిస్తే రోగి మరణించునో తెలియచేస్తాను. కన్నులు , ముక్కు, నాలుక ఇవి వాని యొక్క సహజ గుణములు పొగొట్టుకొని విపరీత గుణములు అనగా కన్నులు సరిగ్గా చూడలేకపోవుట , ముక్కు వాసనని గుర్తించలేకపోవుట , నాలిక రుచిని గ్రహించకపోవుట , శరీరము నందు కాలినట్లు బొబ్బలు , వాపు కలుగుట , నొప్పి , జ్వరం , వాంతి కలిగి గాయము నందలి మాంసము ఊడిపడిపోవుట వంటి లక్షణాలు తేలు కుట్టిన రోగికి కలిగినచో ఆ రోగికి చికిత్స చేసినను బ్రతకడు . ఈ లక్షణాలు చికిత్స సమయానికి అందకుండా ఆలస్యం అవుతున్నకొలది మొదలై చివరకు ప్రాణాలు హరించును .