ఇదోరకం కన్యాశుల్కం.పిల్లకు, కన్యదాతకు కొంత ముట్టజెప్పి వివాహం ఆడుట.దీనిని ఓలి మనువు అంటారు.స్త్రీకి 18 నుంచి 21 సంవత్సరములకు మద్య , పురుషునకు 21 నుంచి 27 సంవత్సరముల మద్య వివాహానికి తగిన సమయం.వివాహం కన్యకు సమవర్ష ప్రాయం లొను, పురుషునకు విషమవర్శ ప్రాయం లొను వివాహం చేయవలెను .వివాహానికి లగ్నబలం ఎంతో ముఖ్యమైనది. లగ్నం సాద్యమైనంత వరకు బలం, శుద్ధమైనధి, దొషం లేకుండా ఉండాలి. శాస్త్రం చెప్పిన 21 దోషాలలో సాధ్యమైనవి వదిలేసి శుభలగ్నం పెట్టాలి .
వివాహానికి శుభమైన వారములు. –
సొమ, గురు, శుక్ర వారములు శ్రేష్టమైనవి.ఆది, మంగళ , శని వారములు అశుభములు. జన్మ కుండలిలో రవి, శని, కుజులు వివాహా కారకులు.అయినను ఆది, మంగళ , శని వారములలొ జరపవచ్చు. బుద, గురు, శుక్ర వారములు శుబధాయకం . ఆది, శని వారములు మధ్యమం, మంగళవారం దుఖప్రధం. సోమవారం వధువుకు సవితి కలుగజేయును. పునర్వివాహం వరునికి కలగాజేయును.
వివాహానికి తిధులు –
అష్టమి, షష్టి , అమావాస్య, తిదులు తప్ప మిగిలిన అన్ని తిధులు స్వీకరించవచ్చు.అందులొ శుక్ల తిధులు శ్రేష్టమైనవి.
వివాహానికి సరైన నక్షత్రాలు. –
అందరి చేత సమ్మతించబడిన శుభ నక్షత్రాలు రోహిణి , మృగశిర, మఖ, ఉత్తర, హస్త, స్వాతి , మూల , అనురాధ, రేవతి . మధ్యమం అయిన నక్షత్రాలు అశ్విని, చిత్త, ధనిష్ఠ, శ్రవణం,ఉత్తరాబాద్ర,లలొ కొన్ని నక్షత్రాలు స్వీకరించవచ్చు. రోహిణి , పునర్వసు , హస్త, జైష్ట , శ్రావణం, రేవతి నక్షత్రాలను కారకత్వాన్ని బట్టి ఎక్కువ శుభామైనవి గా భావించాలి. ముఖ్యం గా నక్షత్రం నందు పాపగ్రహ సంచారం గాని , పాపగ్రహ దృష్టి గాని ఉండరాదు. జన్మ నక్షత్రమునకు 10 వ నక్షత్రములో మరియు జన్మ నక్షత్రములొ వివాహం చేయరాదు .
వివాహ యోగములు –
వ్యరిపాత, వైద్రుతి యోగాములను పూర్తి గాను , పరి యోగములకు మొదటి సగాబాగమును , వివాహమునకు పుర్తిగా వర్జిమ్పవలెను. మిగిలిన వాటిలో శుభాయోగములను తీసుకొనుట ఉత్తమము.
వివాహ కరణములు –
వివాహమునకు అన్ని శుభ కరణములు స్వీకరించ వచ్చు. విష్టి కరణమును పూర్తిగా వదిలివేయవలెను.
వివాహ లగ్నం –
వివాహ లగ్నం చాలా బలం గా ఉండాలి. వివాహ లగ్నం బలం గా ఉంటే ఆ జంట ఎటువంటి మనోవ్యాధి పీడితులు కాకుండా విడదీయలేని బంధం గా ఉంటారు. వివాహం చేయుటకు ఉత్తరాయణ కాలం చాలా ఉత్తమం అయినది.పెల్లికుమారుని కంటే పెళ్లి కూతురు మంచి జాతకురాలు అయ్యి, మంచి సాముద్రికా లక్షణాలు కలిగి ఉంటే దన, పుత్ర వంతురాలు అవుతుంది. మిధున, కర్కాటక, సింహ, కన్య , తుల, ధనుస్సు,కుంభ లగ్నాలు మంచివి.మిక్కిలి శ్రేష్టమైనవి. రవి కర్కాటక , కన్యా రాశులలో ఉన్నప్పుడు ఈ రాశులను వివాహ లగ్నాలుగా స్వీకరించ రాదు.
వివాహనికి మాసములు –
వైశాఖం, జైష్టం, మాగం , ఫాల్గుణం, మాసాలు వివాహానికి శ్రేష్టమైనవి . సుర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం లొ ఉన్నప్పుడు వచ్చే మాసాలు శ్రేష్టమైనవి.మార్గశిరం మధ్యమం, ఆషాడ , కార్తీకాలు నిన్ధ్యములు. మేష , చైత్రములు కూడా ప్రశస్తం .
