మెదడు చెడిపోవడానికి గల కారణాలు –
- మత్తు పదార్దాలు ఎక్కువుగా సేవించడం వలన.
- మానసిక శ్రమ ఎక్కువుగా చేయడం వలన.
- ఎక్కువ ఆందోళన , భయం , ఒత్తిడికి గురి అవ్వడం వలన .
- సంవత్సరాల తరబడి తలకు, పాదాలకి నూనె రాయకపోవడం వలన.
- విరుద్ధమైన ఆహారపదార్ధాలు సేవించడం వలన.
- మధువు, మాంసం ఎక్కువ తీసుకొవడం వలన.
మొదలయిన కారణాల వలన మెదడుకు రక్తం తీసుకుని పోయే రక్తనాళాలు అస్వస్థత చెంది మెదడు వ్యాదులు సంక్రమిస్తాయి.
మెదడు వ్యాధుల లక్షణాలు – - ఏ పని చేయాలన్న ఉత్సాహం లేక పోవడం.
- తరచుగా తలనొప్పి రావడం.
- తలదిమ్ము,, తలతిప్పు కలగడం.
- జ్ఞాపకశక్తి తగ్గిపోవడం.
- అస్పష్టమైన భావాలు , ఆలోచనలు ఏర్పడటం .
- బుద్ధి మందగించడం.
- నరముల బలహీనత .
- పక్షవాతం రావడం .
ఇటువంటి లక్షణాలు అన్ని మెదడు వ్యాధి సంబంధ లక్షణాలుగా పేర్కొనవచ్చు.
నివారణా యోగాలు – మెదడు మోద్దుబారితే – - సునాముఖి ఆకు చూర్ణం పూటకు అర టీ స్పూన్ మోతాదుగా వెన్నతో కలిపి రెండు పూటలా తీసుకోవాలి.
- జాజికాయ చూర్ణం రెండు వేళ్ళకు వచ్చినంత రెండు పూటలా మంచినీళ్ళతో వాడాలి.
- తమలపాకు ల తాంబూలాన్ని రెండు పూటలా వేసుకోవాలి. మెదడు లొ అతివేడి అనుగుటకు –
- ఆవనూనేలో ఉశిరిక పండ్లను ఒక వారం రోజుల పాటు నానబెట్టి తరువాత ఆ నూనేని తలకు మర్దన చేస్తూ ఉంటే మెదడులోని అతివేడి అనిగిపోతుంది.
- బాదం నూనెతో తలకు మర్దన చేసుకుంటూ ఉంటే తలలోని పోటు , వేడి , వికారం తగ్గిపోతాయి
- పెద్ద బచ్చలి ఆకుని నూరి రెండు కనతలకు పట్టు వేస్తే వెంటనే తలలోని దుష్ట వేడిమి తగ్గిపోయి హయిగా నిద్ర పడుతుంది. మెదడు శుభ్రపడటానికి –
- గంజాయి ఆకుని నీడలో ఎండబెట్టి మెత్తటి చూర్ణంగా చేసుకొని కొద్దికొద్దిగా ముక్కు పోడుములాగా పీలుస్తూ ఉంటే మెదడు శుభ్రపడుతుంది.